ASR: అనంతగిరి మండలం బొర్రా పంచాయతీలో పలు ఆశ్రమ పాఠశాలలను మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బీ.కాంతారావు తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో మెనూను పరిశీలించారు. పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పెద్దూరు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసి, రికార్డుల ప్రకారం 130గుడ్లు లేకపోవడంతో హెచ్ఎం కుమారికి మెమో జారీ చేయాలని ఎంఈవో బాలాజీని ఆదేశించారు.