MDK: చదువురాని వయోజనులందరికీ విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఎంఈఓ వెంకటేశం సూచించారు. మంగళవారం పెద్ద శంకరంపేట హైస్కూల్లో ఉపాధ్యాయులకు, సెర్ఫ్ వీవోఏల ఉల్లాస్ నవభారత సాక్షరత సమావేశం నిర్వహించారు. 15 ఏళ్ల పైబడిన వారందరికీ చదువు నేర్పించాలన్నారు. 10, ఇంటర్ మానేసిన వారిని ఓపెన్ స్కూల్లో చేర్పించాలని పేర్కొన్నారు.