W.G: వందే భారత్ రైలు సర్వీసులను చెన్నై-విజయవాడ నుంచి నరసాపురం వరకు పొడిగించాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణ రాజు కోరారు. ఈమేరకు రైల్వే కమిటీ ఛైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్‌కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. పొడిగింపు వల్ల రవాణా, వ్యాపారం పెరుగుతుందని, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుందన్నారు.