GNTR: మంగళగిరి పట్టణంలోని పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ (టిడ్కో) A1 బ్లాక్‌కు చెందిన కొల్లూరు రాజ్యలక్ష్మికి అనారోగ్య సమస్యల నేపథ్యంలో సీఎం సహాయనిధి నుంచి రూ.1,25,000 మంజూరైంది. పట్టణ టిడిపి నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.