AP: పిఠాపురం వైసీపీ నేత వంగ గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. ‘పచ్చకామెర్లు వచ్చిన వాళ్లకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. గీత అక్కయ్య అలాగే మాట్లాడుతున్నారు. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడుతున్నారని అంటున్నారు.. సినిమాకు వెళ్లే లైన్ ఉండదా?. మాజీ సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు లైన్లో నిలబడటం లేదా?’ అని ప్రశ్నించారు.