గూడూరు మండలం కె. నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లోరోసిస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ.. ఫ్లోరోసిస్ లక్షణాలు, ప్రమాదాల గురించి విద్యార్థులకు వివరించారు. దంతాల్లో రంగు మార్పులు, గుంటలు ఏర్పడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.