KDP: పోట్లదుర్తి సమీపంలోని పెన్నా నదిలో చేపల వేటకు వెళ్లి సోమవారం రాత్రి కొట్టుకుపోయిన యువకుని మృతదేహాన్ని మంగళవారం పొద్దుటూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది లైఫ్ బోటులో బయటికి తీసుకువచ్చారు. జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బస్సిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి పెన్నా నదిలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 3.30 గంటల సమయంలో మృతదేహాన్ని వెలికి తీశారు.