TG: ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మొత్తం రూ.54.88 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ ఈ విచారణను జరిపింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, IAS అర్వింద్ కుమార్ నుంచి ఏసీబీ వాంగ్మూలాలను తీసుకుంది. ఈ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.