ప్రకాశం జిల్లాలోని పలు ప్రదేశాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీశ్ తెలిపారు. సోమవారం ఒంగోలులోని CCS పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. చెరుకుపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, దొండపాడుకు చెందిన అంజిరెడ్డి ఇద్దరూ జల్సాలకు అలవాటుపడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారన్నారు.