ప్రకాశం: ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో 49 విన్నతులను అర్జీల రూపంలో ఇచ్చినట్లుగా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలపై ఎస్పీకి అర్జీలు సమర్పించారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి ఆ పరిధిలోని అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.