SKLM: పేట ఎంపీపీ ఆరంగి మురళీధర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఏఎస్సై తులసి నాయుడుతో పాటు సిబ్బంది సత్యవరం ఆయన గృహానికి వెళ్లి అరెస్ట్ చేశారు. మంగళవారం యూరియా కొరతపై జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన ర్యాలీకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ చర్యలు తీసుకున్నారు. జడ్పీటీసీ చింతు రామారావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు.