WGL: ZPTC, MPTC స్థానాల తుది ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పార్టీ సమన్వయం చేసి సహకరించాలని వరంగల్ కలెక్టర్ కోరారు. సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.