VSP: సింహాచలం వరహాలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 15న కృష్ణ జయంతి నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11:30 నుంచి 12:30 వరకు, అదేరోజు సాయంత్రం 6 గంటలకు దర్శనాలు నిలిపివేసినట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. సెప్టెంబర్ 16న సాయంత్రం 4:30 గంటలకు సింహాచలం రాజగోపురం వద్ద ఉట్ల ఉత్సవం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.