కడప: ప్రొద్దుటూరు పట్టణంలోని నాగార్జున ఐటీఐ కాలేజీలో రేపు(బుధవారం) జాబేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. కొప్పర్తిలోని ఏఐఎల్ డిక్సాన్ టెక్నాలజీ లిమిటెడ్ వారు సీసీ కెమెరాల తయారీలో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసి 19 నుంచి 32ఏళ్ల వయసు వారు అర్హులన్నారు.