CTR: పెనుమూరు మండలం ఆముదల పంచాయతీ సచివాలయంలో పెనుమురు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టి. అరుల్ నాధన్ రైతులకు సోమవారం యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుల్ నాధన్ మాట్లాడుతూ.. రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.