E.G: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. వెంటనే వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.