GNTR: తెనాలిలోని అశోక్ అనే యువకుడు సోమవారం మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తాను ప్రేమించిన యువతిని తనతో కలపాలని డిమాండ్ చేస్తూ.. హడావుడి సృష్టించాడు. ఒక యువతితో సహజీవనం చేస్తూ, మరో యువతిని ప్రేమించానని చెప్పడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.