W.G: భీమవరం శివారు దిరుసుమర్రుకు చెందిన దివ్యాంగుడు బొడ్డు రాఘవేంద్రకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అతని తల్లి కలెక్టర్ నాగరాణిని కలిసింది. రూ.15,000 పింఛన్ ఇవ్వాలని కోరగా, దివ్యాంగుడైన రాఘవేంద్రను చూసి చలించిన కలెక్టర్ వెంటనే అతనికి పింఛన్ మంజూరు చేయాలని డీఆర్డీఏ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ స్పందనపై రాఘవేంద్ర తల్లి కృతజ్ఞతలు తెలిపారు.