ప్రకాశం: కనిగిరి నియోజకవర్గ రైతాంగానికి ప్రభుత్వం సకాలంలో యూరియాను అందజేయాలని కోరుతూ మంగళవారం సీపీఐ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు రవీంద్రబాబు మాట్లాడుతూ.. యూరియా అందకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం సకాలంలో కొరత లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయాలని తెలియజేశారు. అనంతరం తాహసీల్దార్ రవిశంకర్కు వినతి పత్రం అందజేశారు.