సత్యసాయి: మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు BJP వార్డు నాయకులు స్వచ్చతపై అవగాహాన కల్పించారు. సోమవారం ఉదయం 5:30 గంటలకు 4వ డివిజన్ శానిటేషన్ మేస్త్రీ, శానిటేషన్ వర్కర్లు, సచివాలయ శానిటరీ అధికారులు, వార్డుల బీజేపీ నాయకులు కలిసి ప్రతి వార్డులోనూ స్వచ్ఛతపై చర్చించారు. కార్మికుల సమస్యలను తెలుసుకుని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.