ADB: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నిజామాబాద్, ఆదిలాబాద్ BSNL జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో గల నెట్వర్కు సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చర్చించారు. మారుమూల గ్రామాల్లో BSNL టవర్లను ఏర్పాటు చేసి సేవలను అందించాలని కోరగా అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.