NLG: అనుమతి లేకుండా చెట్లను నరికిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అశోక్ రెడ్డి తెలిపారు. నకిరేకల్‌లోని ఇందిరా మహిళా సమాఖ్య కార్యాలయంలో 15 చెట్లను ఆదివారం నరికి వేశారు. విషయం తెలిసుకున్న అడవి అధికారులు వెంటనే మొద్దులను తరలించే ట్రాక్టర్లను సీజ్ చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నారు.