ATP: కర్ణాటక బళ్లారిలో జరిగిన చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు మెరిశారు. దేశవ్యాప్తంగా 169 మంది పాల్గొన్న ఈ పోటీలో అండర్ 8 ఓపెన్ విభాగంలో ఈ.అన్విత్ 4 పాయింట్లతో 7వ స్థానం సాధించాడు. యంగెస్ట్ క్రీడాకారుడిగా సంతోష్ 3 పాయింట్లతో బహుమతి అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్‌కుమార్ నాయుడు వారిని అభినందించారు.