NRML: నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య శాంతియుతంగా ముగిశాయి. ఆదివారం రాత్రి వరకు సాగిన వినాయక నిమర్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వినాయక ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా ప్రజలకు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.