BDK: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈనెల 14 నుంచి హైదరాబాద్ కార్పొరేట్ వైద్యులు సింగరేణి ఆస్పత్రులను సందర్శించనున్నారని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న కొత్తగూడెంలోని ఆస్పత్రికి కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు రానున్నారని పేర్కొన్నారు.