సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని నల్లప్పశెట్టిపల్లి కొట్టాల వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరుకు చెందిన డ్రైవర్ మాధవన్ (50) రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.