W.G: ఉండి మండలం పాములపర్రులో ఎలక్ట్రికల్ ఏఈపై జరిగిన దాడిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక క్రిస్టియన్ శ్మశానవాటిక స్థలంలోని ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని ఏఈపై దాడికి దిగడం సరికాదని అన్నారు. అసలు ఆ స్థలం దళిత క్రిస్టియన్ల శ్మశాన వాటికకు ఇచ్చారా, లేక హిందూ దళితుల శ్మశాన వాటికకు ఇచ్చారా? తేలాల్సి ఉందన్నారు.