GNTR: గుంటూరు జీజీహెచ్లో మాతా, శిశు వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.86 కోట్లతో నిర్మిస్తున్న 500 పడకల బ్లాకులో వైద్య పరికరాల కొనుగోలుకు ఇటీవల మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ చర్యలతో గర్భిణులు, నవజాత శిశువుల మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.