KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో అండర్-18, 20 విభాగంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది క్రీడాకారులను ఏలూరులో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేశారు. కాగా, ఈ ఎంపిక క్రీడాకారుల భవిష్యత్‌కు దోహదపడనుంది.