మాతృ భాషతో పాటు మరో భాష నేర్చుకోవడానికి సతమతమవుతుంటాం. అలాంటిది చెన్నైకి చెందిన 19 ఏళ్ల అక్రమ్ 400 భాషలను చదవగలడు, రాయగలడు. అందులో 46 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. పిన్న వయస్సులోనే బహు భాషల్లో టైప్ చేసి మొదటి రికార్డు, గంటలోనే జాతీయ గీతాన్ని 20 భాషల్లో రాసి రెండోది సాధించాడు. ఆరు రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఈ ప్రతిభతోనే అనేక ప్రపంచ రికార్డులు, అవార్డులు పొందాడు.