BHPL: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికల కోసం ఈ నెల 6న విడుదలైన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఈవో, ఎంపీడీవోలు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యంతరాలు 8 వరకు సమర్పించవచ్చు.