NRML: ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గ్రాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాల పాలైన సంఘటన ముధోల్ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. బైంసా నుంచి నిజామాబాద్‌కు కారులో వెళ్తున్న నీల గ్రామానికి చెందిన బలరాం, వర్ని గ్రామానికి చెందిన అనసూయలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.