ATP: సీఎం పర్యటన నేపథ్యంలో అనంతపురంలో 15 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శ్రీనగర్ కాలనీ, కేశవరెడ్డి స్కూల్ సమీపంలో తదితర 15 ప్రాంతాల్లో చేస్తున్న పార్కింగ్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం, డిప్యూటీ సీఎం వస్తుండటంతో ఏర్పాట్లు పక్కగా ఉండాలని సూచించారు.