ATP: కుందుర్లో మండల కేంద్రంలో పదేళ్ల క్రితం ఆర్డీటీ స్వచ్చంద సంస్థ లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కాగా, వాటర్ ప్లాంట్ ఐదు నెలలుగా నిరుపయోగంగా ఉంది. పనిముట్లు చెడిపోవడంతో అధికారులు మరమ్మతులు చేయించకుండా మూసివేయడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిరుపయోగంగా వాటర్ ప్లాంట్ను పునరుద్ధించాలని కోరుతున్నారు.