GNTR: సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై ఇంస్టాగ్రామ్లో అసభ్యకర పోస్టులు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులపై పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీడీపీ రాష్ట్ర నాయకుడు గాలి సతీష్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట ప్రసాద్ తెలిపారు. పోస్టుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.