ATP: రాయదుర్గంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మెచ్చిరి గ్రామానికి చెందిన ఇద్దరు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా, బళ్లారి రోడ్డు వాల్మీకినగర్ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న పాదచారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.