GNTR: చంద్రగ్రహణం ముగియడంతో పాటు సోమవారం కావడంతో తెనాలిలోని శ్రీ పర్వత వర్ధిని సమేత రామేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, దానాలు సమర్పించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.