జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. గుడార్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు మోహరించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకోగా, ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారితో పాటు ఓ జవాన్ కూడా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.