PLD: ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో కౌలు రైతు యర్రంశెట్టి కోటేశ్వరరావు (47) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న ఆయనకు సుమారు రూ.25 లక్షల అప్పు ఉందని, దానిని తీర్చలేక ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.