NDL: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,72,884 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,79,389 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.30 అడుగుల వద్దకు నీరు చేరింది. నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండుకుండను తలపిస్తోంది. 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.