E.G: నిడదవోలులోని కాల్దరి రైల్వే అండర్ పాస్ వద్ద మంగళవారం నుంచి నెల రోజులపాటు వాహన రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు ఆర్ & బీ అధికారులు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నేపథ్యంలో రహదారి ముసివేస్తున్నామన్నారు. కావున వాహనదారులు, ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.