SRD: పటాన్ చెరువు శాంతి నగర్, శ్రీనగర్ జంట కాలనీలలో కొలువైన గణనాథుడికి, ఘనంగా పూజలు చేసి, గొప్పగా నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న కాలనీల భక్తులకు జంట కాలనీల బాల వినాయక అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించిన ఐశ్వర్య రెడ్డికి దీవెనలతో పాటు, ఆశీర్వచనములు తెలిపారు.