SRCL: రుద్రంగి మండల కేంద్రం నుండి కుక్కల గండి తండా వరకు 4 కోట్ల 57 లక్షల బీటీ రోడ్డు మంజూరు కావడం పట్ల మండల ప్రజలు సోమవారం హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, గిరిజనులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.