BDK: జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన నేడు వాయిదా పడినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలా నాయక్ సోమవారం ప్రకటించారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా ఈ పర్యటన వాయిదా వేసినట్లు అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని అన్నారు. పార్టీ శ్రేణులు గమనించాలని కోరారు.