ప్రకాశం: హెచ్ఐవీ, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 12న ఒంగోలు నగరంలో రెడ్ రిబ్బన్ క్లబ్ సహకారంతో ఐదు కిలో మీటర్ల పరుగు (మారథాన్) నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఎయిడ్స్ నియంత్రణ విభాగం జిల్లా అధికారిణి డాక్టర్ బి. వాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో 17-25 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.