SRPT: శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళాపరిషత్, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థలు సంయుక్తంగా ఇచ్చే ‘విశ్వకర్మ స్ఫూర్తి లెజెండరీ జాతీయ పురస్కారానికి’ హుజూర్‌నగర్‌కు చెందిన నరసింహాచారి ఎంపికయ్యారు. ఈ నెల 14న హుస్నాబాద్‌లోని శ్రీ రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నారు.