NZB: ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కంటైనర్ హైదరాబాద్ నుంచి నాగపుర్‌కు పార్సిల్స్ తీసుకెళ్తున్న సమాయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.