PLD: కారంపూడి మండలంలోని పల్లెల్లో వర్షాకాలం కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సోమవారం డిమాండ్ చేస్తున్నారు.