VKB: ఉచిత గిఫ్టుల పేరుతో ఎరవేసి ఆశ చూపితే ఎవరూ నమ్మొద్దని ధరూర్ SI రాఘవేందర్ సోమవారం అన్నారు. లాటరీ, ఫ్రీ గిఫ్ట్స్ అంటే ఆశ పడకూడదని, ఉచితంగా ఇస్తున్నారు అంటే అది మోసమేనని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతుందని చెప్పారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.