KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ కష్టకాలంలో భరోసా ఇవ్వాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మౌనంగా ఉండటంపై రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. రామగుండం ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యలపై బండి సంజయ్ చొరవ చూపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.